- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాకినాడ జిల్లాలో విషాదం.. మహిళ, మూడేళ్ల బాలుడు ఆత్మహత్య
టీవల కాలంలో ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. చిన్న చిన్న విషయాలకు కూడా బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఏ మృతి వెనుక చూసినా కుటుంబ సలహాలు, ఆర్థిక ఇబ్బందులు, ప్రేమ వ్యవహారం, భార్యాభర్తల గొడవ వంటి కారణాలే కనిపిస్తున్నాయి....

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల కాలంలో ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. చిన్న చిన్న విషయాలకు కూడా బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఏ మృతి వెనుక చూసినా కుటుంబ సలహాలు, ఆర్థిక ఇబ్బందులు, ప్రేమ వ్యవహారం, భార్యాభర్తల గొడవ వంటి కారణాలే కనిపిస్తున్నాయి. ఆత్మహత్య మహాపాపం అని, పరిష్కరించుకుంటే సమస్యలు ఉండవని అవగాహన కల్పించినప్పటికీ ఆత్మహత్యలు ఆగడం లేదు. ఉరివేసుకుని, పురుగులు మందు, నీళ్లలో దూకి ప్రాణాలు తీసుకుంటున్నారు. మిగిలి కుటుంబ సభ్యుల్లో విషాదాన్ని నింపుతున్నారు. తాజాగా జరిగిన ఘటన సైతం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
కాకరాపల్లిలో విషాదం..
కాకినాడ జిల్లా(Kakinada District) కోటనందూరు మండలం కాకరాపల్లి(Kakarapally)లో విషాదం చోటు చేసుకుంది. తమ్మయ్య చెరువు(Tammaiah Cheruvu)లో పడి మహిళ, మూడేళ్ల బాలుడు మృతి మృతి చెందారు. మృతులను నర్సీపట్నంకు చెందిన భాగ్యలక్ష్మి, సాయిగా గుర్తించారు. కుటుంబ సమస్యల వల్లే ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. కుటుంబ వివరాలు తెలుసుకుని వారిని అందించారు. ఇద్దరి మృతదేహాల్ని పోస్టుమార్టంకు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తున్నారు.






