వివేకా హత్య కేసులో ప్రత్యక్ష సాక్షికి తీవ్ర అస్వస్థత

by Chukka Sudharani |

రెండు తెలుగు రాష్ట్రాల్లో మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు కలకలం రేపిన సంగతి తెలిసిందే.

వివేకా హత్య కేసులో ప్రత్యక్ష సాక్షికి తీవ్ర అస్వస్థత
X

దిశ, వెబ్‌డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాల్లో మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ కేసులో ప్రత్యక్ష సాక్షి అయిన వివేకా ఇంటి వాచ్ మెన్ రంగన్న మంగళవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ మేరకు ఆయన్ని వైఎస్ఆర్ జిల్లా పులివెందుల ప్రభుత్వాసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు. కాగా.. వైఎస్ వివేకా హత్య కేసులో రంగన్న రెండేళ్ల క్రితం మేజిస్ట్రేట్ ముందు కీలక వాంగ్మూలం ఇచ్చారు. అయితే.. కేసు విచారణ కీలక దశకు చేరుకున్న సమయంలో రంగన్న అస్వస్థతకు గురికావడం పలు చర్చలకు దారితీస్తుంది.

Next Story