విశాఖలో ప్రధాని మోడీ కార్యక్రమం.. 24 మందికి కీలక బాధ్యతలు

by Vemula.Srinu Prasad |

త్వరలో రాష్ట్రానికి ప్రధానమంత్రి రాబోతున్న నేపథ్యంలో పలువురికి కీలక బాధ్యతలు అప్పగించారు..

విశాఖలో ప్రధాని మోడీ కార్యక్రమం.. 24 మందికి కీలక బాధ్యతలు
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రానికి త్వరలో ప్రధానమంత్రి(Prime Minister) రాబోతున్నారు. విశాఖ(Visakha)లో నిర్వహించే యోగా డే(Yoga Day)లో మోడీ(Modi) పాల్గొనున్నారు. 11వ అంతర్జాతీయ యోగా డేను ఈసారి విశాఖలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పటిష్ట కార్యచరణను రూపొందించింది. యోగా డే కార్యక్రమం బాధ్యతలపై కీలక నిర్ణయం తీసుకుంది. యోగా దినోత్సవం నిర్వహణ బాధ్యతలను మొత్తం 24 మందికి అప్పగించింది. ఈ కార్యకమానికి సంబంధించి నోడల్ అధికారిగా వైద్యారోగ్య శాఖ స్పెషల్ కార్యదర్శి కృష్ణబాబుకు బాధ్యతలు కేటాయించింది. యోగా డే నిర్వహణ, సీఎంవోతో సంప్రదింపులు, ప్రొటోకాల్ వ్యవహారాలను ఆయనే పర్యవేక్షిస్తారు. యోగా డే ఏర్పాట్లు, సమన్వయ బాధ్యతలను విశాఖ కలెక్టర్‌కు అప్పగించారు. ఇక సీఎం చంద్రబాబు కార్యక్రమం రూపకల్పన బాధ్యతలను సాధారణ పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శి చూసుకోనున్నారు.

ఇక యోగా డేలో 2 కోట్లకు మంది ప్రజలను భాగస్వాములను చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. యోగాంధ్ర 2025 పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంతో రికార్డు నెలకొల్పాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా ఈ కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన కల్పించే ప్రచారాలను త్వరలో ప్రారంభించనుంది.

Next Story