ఏపీలో గాలివాన బీభత్సం.. మిర్చి, మామిడి రైతుల అష్టకష్టాలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-04-13 13:58:57  IST  )

రాష్ట్రంలో పలు చోట్ల గాలి వాన బీభత్సం సృష్టించింది...

ఏపీలో గాలివాన బీభత్సం.. మిర్చి, మామిడి రైతుల అష్టకష్టాలు
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో పలు చోట్ల గాలి వాన(wind rain) బీభత్సం సృష్టించింది. ఉదయం వరకూ వాతావరణం(Weather) ఒకలా.. మధ్యాహ్నం వరకూ మరోలా మారిపోయింది. ఒక్కసారిగా వాతావరణ చల్లబడి వడగళ్ల వర్షం(Hail rain) పడింది. దీంతో ప్రకాశం, బాపట్ల జిల్లాలో భారీ వర్షం పడింది. ప్రకాశం జిల్లా దర్శి, అద్దంకిలో భారీగా ఈదురుగాలులు వీచాయి. ఒంగోలు, పొదిలి, కొనకనమిట్లలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. దీంతో మిర్చి రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఒక్కసారిగా వర్షం విరుచుకుపడటంతో కల్లాల్లో ఉన్న మిర్చి తడిచిపోయింది. మిర్చిని కాపాడుకునేందుకు రైతులు నానా అవస్థలు పడ్డారు. పలు మండలాల్లో వాడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. దీంతో వరి, మామిడిపంటలు, కరెంట్ స్తంభాలు నెలకొరిగాయి. ఈ మేరకు పలు ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. నాగులుప్పలపాడు మండలాల్లో మిర్చికి తీవ్ర నష్టం వాటిల్లింది. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు.

Next Story