YS Jagan: ప్రశ్నిస్తే భూస్థాపితం చేస్తారా..? జగన్​సూటి ప్రశ్న

by Thanuru Gopichand |

ప్రశ్నించిన ప్రతిపక్ష నేతలను భూస్తాపితం చేస్తారా.. అని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్​జగన్​ప్రశ్నించారు.

YS Jagan: ప్రశ్నిస్తే భూస్థాపితం చేస్తారా..? జగన్​సూటి ప్రశ్న
X

చంద్రబాబుకు అసహనం పెరిగింది

రైతుల మీది కేసులు పెడతారా..?

ఇలాగే తప్పుడు కేసులు పెడితేనే నక్సలిజం వస్తుంది..

దిశ, డైనమిక్ ​బ్యూరో : ప్రశ్నించిన ప్రతిపక్ష నేతలను భూస్తాపితం చేస్తారా.. అని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్​జగన్​ప్రశ్నించారు. ఈ రోజు తాడేపల్లిలోని తన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు (Chandrababu) నీకు భయం ఎందుకు? ఎందుకు అంత అసహనం అని ప్రశ్నించారు. సత్తెనపల్లిలో పోలీసులను ఎక్కడికక్కడ పెట్టి.. జనం రాకూడదని ఎందుకు ఆదేశాలు ఇచ్చారని అన్నార. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజల్లో విప్లవం వచ్చిందని.. రెంటపాళ్ల పర్యటన విజయవంతమైందన్నారు. ప్రభుత్వంపై ఏడాదిలోనే తీవ్ర వ్యతిరేకత వచ్చిందని తెలిపారు. ఇంత తక్కువ కాలంలో వ్యతిరేకత ఏ ప్రభుత్వానికీ రాలేదని తెలిపారు. అణచివేతకు నిదర్శనంగా చంద్రబాబు తయారయ్యారు.. మా కార్యకర్తలను అడ్డుకోవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. పార్టీ కార్యకర్తలను పరామర్శించడం కూడా తప్పా అన్నారు. ఇద్దరు పొగాకు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు..

రైతులకు సంఘీభావంగా వెళ్తే ఆంక్షలు ఎందుకు పెట్టారు? అని ప్రశ్నించారు. 40 మందితో 40వేల మందిపై రాళ్లు వేసే కుట్ర చేశారని ఆరోపించారు. రాళ్లు వేసినా రైతులు, జనం సంయమనం పాటించారని తెలిపారు. పొదిలిలో దాడికి ప్రేరేపించింది టీడీపీ వాళ్ళైతే, కేసులు రైతుల మీద పెట్టించారని అన్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఇరికించేందుకు తప్పుడు సాక్ష్యాలు క్రియేట్ చేశారని తెలిపారు. తప్పుడు స్టేట్మెంట్ ఇవ్వాలని గన్ మెన్ బలవంతం చేశారని, గన్ మెన్ పై దాడి కూడా చేశారని పేర్కొన్నారు. దళిత బాలికపై టీడీపీ నేతలు సామూహిక అత్యాచారం చేశారు.. బాలిక గర్భం దాలిస్తే ఈ విషయం బటయకొచ్చిందని తెలిపారు. కనీసం ఫిర్యాదు కూడా ఇవ్వకుండా భయపెట్టారని ఆరోపించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పుతుందనే కక్షతో.. సాక్షి ఆఫీసులపై టీడీపీ నేతలు దాడులకు పాల్పడ్డారని జగన్​ఆరోపించారు. ఇలా తప్పుడు కేసులు పెడితే వ్యవస్థ బతకదు.. ఇలాగే నక్సలిజం వస్తుందన్నారు.

Next Story