దూకుడు పెంచిన టీడీపీ కార్యకర్తలు.. వైసీపీని ఢీకొట్టే అస్త్రం అదేనా..?

by Kema Shiva Kumar |

దూకుడు పెంచిన టీడీపీ కార్యకర్తలు.. వైసీపీని ఢీకొట్టే అస్త్రం అదేనా..? will TDP leaders promotions on social media benefit party

దూకుడు పెంచిన టీడీపీ కార్యకర్తలు.. వైసీపీని ఢీకొట్టే అస్త్రం అదేనా..?
X

దిశ, వెబ్ డెస్క్: టీడీపీ కార్యకర్తలు దూకుడు పెంచారు. ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా ఏపీలో వైసీపీని ఓడించి టీడీపీకి పట్టం కట్టబెట్టాలని నిర్ణయించుకున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ ఎంచుకున్న అస్త్రాన్నే ఈసారి టీడీపీ కార్యకర్తలు వశం చేసుకున్నట్టు కనిపిస్తున్నారు. 2019 ఎన్నికలకు ముందు ప్రశాంత్ కిషోర్ వ్యూహంలో భాగంగా వైసీపీ కోసం ప్రత్యేక సోషల్ మీడియా వింగ్ ను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా మారుమూల పల్లెటూళ్ల నుండి రాష్ట్ర స్థాయి వరకు ఉన్న అభిమానులు, కార్యకర్తలు, లీడర్స్ పార్టీకి సంబంధించిన ప్రతి అప్డేట్ ను జనాల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారు. పార్టీ సమాచారమే కాదు, ఆనాటి అధికార ప్రభుత్వ లోటుపాట్లను మీమ్స్, జోక్స్, వీడియోలు ఇలా రకరకాల పోస్ట్స్ ద్వారా జనాల్లోకి బలంగా తీసుకెళ్లారు. ఇక అదే పంథాను ఇప్పుడు టీడీపీ నాయకులు ఫాలో అవుతున్నారు.

టీడీపీ అధిష్టానం, నేతల్లో గెలుస్తామన్న అతి ధీమా వలనే 2019 ఎన్నికల్లో ఘోర పరాజయానికి కారణమనేది టీడీపీ కార్యకర్తల నుండి బలంగా వినిపించే వాదన. ఈసారి బరిలో ఎవరు నిలబడతారనే అంశాన్ని పక్కనబెట్టి రాష్ట్రంలో టీడీపీని నిలబెట్టాలన్నదే ఇప్పుడు కార్యకర్తల్లో రగులుతోన్న కాంక్ష. అందులోనూ మరోసారి వైసీపీ గెలిస్తే రక్షణ ఉండదని, తమపై దాడులు పెరిగే అవకాశం ఉందని తెలుగు తమ్ముళ్లు అంతర్మథనంలో ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే సీఎం రేసులో చంద్రబాబు ఉంటాడా లేక లోకేష్ ఉంటాడా అనేది కూడా మాకు అవసరం లేదు, తిరిగి మా పార్టీని గెలిపించాలి అని నిశ్చయంచుకున్నామంటున్నారు యెల్లో వారియర్స్.

పార్టీ ప్రచారహోరుతో సోషల్ మీడియాలో దుమ్ము లేపుతున్నారు. వైసీపీ సర్కార్ వైపు నుండి చిన్న తప్పు దొరికినా నెట్టింట చెడుగుడు ఆడేస్తున్నారు. అలాగే పార్టీకి సంబంధించిన ప్రతి చిన్న అంశాన్ని సోషల్ మీడియా వేదికగా స్ప్రెడ్ చేస్తున్నారు. వైసీపీ తప్పిదాలను చాటడమే కాదు, టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రస్తుత ప్రభుత్వ పొరపాట్లను కంపేర్ చేస్తూ వీడియోల రూపంలో ప్రమోట్ చేస్తున్నారు. ఇక వైసీపీకి విజయాన్ని చేకూర్చడంలో ప్రధానంగా నిలిచినా నవరత్నాల పథకాలలో అమలుకాని వాటి గురించి ప్రశ్నించడానికి సోషల్ మీడియాని వేదికగా చేసుకున్నారు. క్షేత్రస్థాయిలో టీడీపీ వాట్సాప్ గ్రూప్స్ క్రియేట్ చేసి విస్తృత ప్రచారం షురూ చేశారు. లోకల్ ఫాలోయర్స్ నుండి ఎన్నారైస్ వరకు సోషల్ మీడియానే అస్త్రంగా టీడీపీ గెలుపుకై ఫైట్ చేస్తున్నారు. చూడాలి మరి వీళ్ళ నమ్మకం ఫలితాన్నిస్తుందో లేదో.

Next Story