అంబటిని అరెస్ట్ చేస్తారా? ఇంటి వద్ద పోలీసుల వజ్ర వెహికల్

by Ramesh Naini |   (  Updated:2026-01-31 15:50:46  IST  )

గుంటూరులోని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటి దగ్గర హైటెన్షన్‌ కొనసాగుతోంది.

అంబటిని అరెస్ట్ చేస్తారా? ఇంటి వద్ద పోలీసుల వజ్ర వెహికల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: గుంటూరులోని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటి దగ్గర హైటెన్షన్‌ కొనసాగుతోంది. సీఎం చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అంబటి రాంబాబుపై పలు ప్రాంతాల్లో కేసులు నమోదు అయ్యాయి. దీంతో అంబటిని అరెస్ట్ చేస్తారనే పుకార్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పోలీసులు ఇంటి వద్ద భారీ స్థాయిలో మోహరించి ఉన్నారు. అంబటి అరెస్ట్‌కు రంగం సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇంటి దగ్గరికి పోలీసుల వజ్ర వెహికల్ వచ్చింది. ఇప్పటికే ఇంటి వద్ద భారీగా మోహరించి ఉన్న టీడీపీ కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు. మరికాసేపట్లో అంబటిని తరలించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అంబటిపై నరికల్లు పీఎస్‌లతో కేసు నమోదు అయింది. బాజీ చౌదరి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

Next Story