రాష్ట్రంలో ఆటవిక పాలన నడుస్తోంది! మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ

by Geesa Chandu |

వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవికిరణ్ కు మద్దతుగా.. న్యాయ సహాయం కోసం గుడివాడ మాజీ మంత్రి పేర్ని నాని, మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ వెళ్లారు.

రాష్ట్రంలో ఆటవిక పాలన నడుస్తోంది! మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ
X

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవికిరణ్ కు మద్దతుగా.. న్యాయ సహాయం కోసం గుడివాడ మాజీ మంత్రి పేర్ని నాని, మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ వెళ్లారు. అయితే అక్కడికి వెళ్ళిన వారి కార్లపై టీడీపీ, జనసేన కార్యకర్తలు దాడి చేయడం దారుణమని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. మాజీ మంత్రి వాహనాలపై దాడి చేయడం, దౌర్జన్యానికి దిగడం ఎంత వరకు కరెక్ట్ అని ఆయన ప్రశ్నించారు. అయితే ఇదే ఘటనకు సంబంధించి బొత్స సత్యనారాయణ కృష్ణా జిల్లా ఎస్పీకి ఫోన్ చేసి, పోలీసుల తీరు సరిగా లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వైసీపీ నేతలకు భద్రత కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

బొత్స మాట్లాడుతూ.. " రాష్ట్రంలో ఆటవిక పాలన నడుస్తుందని, రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని దుయ్యబట్టారు. ఇప్పటివరకు గుడివాడలో మాజీ మంత్రి పేర్ని నానిపై రెండు సార్లు దాడులకు తెగబడ్డారని, పేర్ని నాని కారుపై దాడికి పాల్పడ్డ జనసేన, టీడీపీ నేతలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే పోలీసుల సమక్షంలోనే ఈ దాడులు జరగడం విడ్డూరంగా ఉందని, రాష్ట్రంలో పోలీసులు ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు" మాజీ మంత్రి బొత్స.

Next Story