- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీలో దారుణం..భర్తను చంపి డోర్ డెలివరీ చేసిన భార్య
ఏపీలో దారుణం చోటు చేసుకుంది. భర్తను చంపి భార్య డోర్ డెలివరీ చేసింది. ఈ ఘటన నంద్యాల జిల్లాలో జరిగింది. జిల్లాలోని నూనెపల్లికి చెందిన రమణయ్య అనే వ్యక్తిని పిడుగురాళ్లకు చెందిన రమణమ్మ

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో దారుణం చోటు చేసుకుంది. భర్తను చంపి భార్య డోర్ డెలివరీ చేసింది. ఈ ఘటన నంద్యాల జిల్లాలో జరిగింది. జిల్లాలోని నూనెపల్లికి చెందిన రమణయ్య అనే వ్యక్తిని పిడుగురాళ్లకు చెందిన రమణమ్మ అనే మహిళ 20ఏళ్ల క్రితం వివాహం చేసుకుంది. అయితే ఇద్దరి మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతుండటంతో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది.
కొద్దిరోజులు గడిచినా తిరిగి ఇంటికి రాలేదు. ఈ క్రమంలో ఆమెకు నచ్చజెప్పేందుకు భర్త ఇంటికి రాగా అతడితో రమణమ్మ ఆమె కుటుంబ సభ్యులు ఘర్షణకు దిగారు. గొడవ పెద్దది కావడంతో రమణమ్మ ఆమె తమ్ముడు కలిసి రమణయ్య కండ్లలో కారం చల్లి దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన అతడు అక్కడికక్కడే కన్నుమూశాడు. చంపిన తరవాత డెడ్ బాడీని నంద్యాలకు తీసుకువచ్చి అతడి ఇంటి దగ్గరే పడేసి వెళ్లిపోయారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.






