AP News : ఆగని భర్తలపై దారుణాలు... నెల్లూరులో మరో ఘటన

by Muthe.Rajitha |

రోజురోజుకి భర్తలపై జరుగుతున్న దారుణాలు ఎక్కువ అవుతున్నాయి.

AP News : ఆగని భర్తలపై దారుణాలు... నెల్లూరులో మరో ఘటన
X

దిశ, వెబ్ డెస్క్ : రోజురోజుకి భర్తలపై జరుగుతున్న దారుణాలు ఎక్కువ అవుతున్నాయి. ప్రియుడిని పెళ్లి చేసుకోవాలనుకున్న ఓ మహిళ తన భర్తను ప్రియుడితో కలిసి కరెంటు వైరును మెడకు బిగించి, ఊపిరి ఆడకుండా చేసి చంపేసింది(Husband Murdered). పోలీసుల వివరాల ప్రకారం పొట్టి శ్రీరాములు నెల్లూరు(Nellore) జిల్లా రాపూరులో ధనమ్మ అనే మహిళ తన ప్రియుడితో కొనసాగిస్తున్న వ్యవహారం భర్తకు తెలియడంతో ఇద్దరి మధ్య గొడవ తెలెత్తింది. దీంతో ఎలాగైనా భర్తను వదిలించుకొని ప్రియుడితో సెటిల్ అవ్వాలని నిర్ణయించుకున్న ధనమ్మ భర్తను కరెంటు వైరుతో గొంతుకు బిగించి చంపేసింది. అనంతరం ఇద్దరూ పరారవ్వగా.. పోలీసులు ఆమె ప్రియున్ని అదుపులోకి తీసుకున్నారు. ధనమ్మ ప్రస్తుతం పరారీలో ఉంది.

Next Story