‘పవన్ కళ్యాణ్ ఇప్పుడెందుకు మాట్లాడటం లేదు’.. మాజీ మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు

by Jakkula.Mamatha |   (  Updated:2025-06-10 08:03:49  IST  )

రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం పై మాజీ మంత్రి రోజా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

‘పవన్ కళ్యాణ్ ఇప్పుడెందుకు మాట్లాడటం లేదు’.. మాజీ మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం పై మాజీ మంత్రి రోజా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. బాలికలు, మహిళలపై లైంగిక దాడి ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. రాష్ట్రంలో ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్న ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని మాజీ మంత్రి రోజా విమర్శించారు.

అనంతపురంలో ఓ యువతిని అత్యంత కిరాతకంగా పెట్రోల్ పోసి నిప్పంటించి చంపేశారని, మృతదేహాన్ని మణిపాల్ స్కూల్ వెనుక పడేశారని ఆవేదన చెందారు. ఈ క్రమంలో తమ కూతురు కనిపించడం లేదని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసిన.. పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే ఈ దుర్ఘటన చోటుచేసుకుందని ఆమె ఆరోపించారు. ఈ తరుణంలో ఆడబిడ్డ హత్యకు గురైతే, సీఎం చంద్రబాబు వీకెండ్‌కు హైదరాబాద్ వెళ్లిపోయారని ఆర్కే రోజా విమర్శలు గుప్పించారు. ఇకపోతే, ప్రజల భద్రత కంటే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు సెలూన్ షాప్ ప్రారంభోత్సవాలు, ఇతర పర్యటనలు ముఖ్యమయ్యాయని ఎద్దేవా చేశారు.

హోంమంత్రి అనిత కేవలం ప్రెస్ మీట్లు పెట్టి వైఎస్ జగన్‌ కుటుంబంపై ఆరోపణలు చేయడం తప్ప.. ఆడబిడ్డల రక్షణ గురించి ఒక్క మాట కూడా మాట్లాడటం లేదని రోజా మండిపడ్డారు. ఇది రాష్ట్రంలో నేడు ఆడబిడ్డల పరిస్థితి. ఇది అధికారంలో ఉన్న వారిచే జరుగుతున్న నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మహిళలను చంపేస్తుంటే సీఎం చంద్రబాబు(CM Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan), హోంమంత్రి(Home Minister Anitha) కనీసం మాట్లాడటం లేదని మాజీ మంత్రి రోజా(Former Minister roja) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

రాష్ట్రంలో ఓ మహిళ హోంమంత్రిగా ఉండి కూడా మహిళలకు రక్షణ లేకుండా పోయిందని.. హోంమంత్రి అనిత తక్షణమే రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు. చిన్న పాపను చంపేసి, పూడ్చేసిన ప్రభుత్వం పట్టించుకోలేదు. తన్మయ్ అనే గిరిజన అమ్మాయి కనిపించడం లేదని ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదు. ఫిర్యాదును పట్టించుకోక పోవడం వల్లనే తన్మయ్ శవమై కనిపించింది. రాష్ట్రంలో మహిళలకు అన్యాయం జరుగుతుంటే పవన్ కల్యాణ్ ఎందుకు మాట్లాడటం లేదని మాజీ మంత్రి రోజా ప్రశ్నించారు.

Next Story