- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Perni Nani : ఇప్పుడు పవన్ ఎందుకు నోరెత్తడం లేదు : పేర్ని నాని
ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్(AP Land Titling Act)పై వైసీపీ నాయకుడు పేర్ని నాని(Perni Nani) తీవ్ర విమర్శలు చేశారు.

దిశ, వెబ్ డెస్క్ : ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్(AP Land Titling Act)పై వైసీపీ నాయకుడు పేర్ని నాని(Perni Nani) తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల ముందు ఈ చట్టాన్ని రద్దు చేస్తామని చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu), పవన్ కల్యాణ్(Pawan Kalyan) హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక రద్దు చేసినట్లు ఉత్తిత్తిగా ప్రకటించారని ఎద్దేవా చేశారు. కానీ ఇప్పుడు "ఆంధ్రప్రదేశ్ రీసర్వే ప్రాజెక్ట్" పేరుతో భూసర్వేను తిరిగి చేపడుతున్నారని కూటమి ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. ఈ భూసర్వేపై చంద్రబాబు, పవన్ సమాధానం చెప్పాలని పేర్ని నాని డిమాండ్ చేశారు.
ఈ రీసర్వే గత వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వ "జగనన్న శాశ్వత భూ హక్కు" పథకానికి సమానమని తెలిపారు. ఎన్నికల్లో దీనిని విషంగా చిత్రీకరించిన చంద్రబాబు, పవన్ ఇప్పుడు చేస్తున్నదేమిటని మండిపడ్డారు. ప్రభుత్వం వందల కోట్ల రూపాయలతో అప్పులు చేసి ఈవెంట్‌లు నిర్వహిస్తూ, విమానాలు, హెలికాప్టర్లకు డబ్బు వృథా చేస్తోందని విమర్శలు చేశారు. ఏడాదిగా సంపద సృష్టి శూన్యమని, అప్పులు తప్ప ఏమీ లేదని ఆరోపించారు.
రాష్ట్రంలో ఆడపిల్లలపై దాడులు జరుగుతున్నా పవన్ కల్యాణ్ ఎందుకు నోరెత్తకుండా ఉన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయనకు రాష్ట్ర సమస్యలు కనిపించక పోగా.. మాజీ సీఎం జగన్ పైనే విమర్శలు చేస్తూ కూర్చుంటున్నారని మండిపడ్డారు.






