- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జైల్లో ఉంటే ఇన్ని వసతులు కావాలా ? మిథున్ రెడ్డి ఏమేం అడిగారో తెలుసా?
ఏపీ లిక్కర్ స్కామ్ కేసు (AP liquor scam case)లో ఏ4 నిందితుడిగా అరెస్టై.. రాజమండ్రి సెంట్రల్ జైల్లో (Rajahmundry central jail) రిమాండ్ లో ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి (MP Mithun Reddy).. తనకు జైల్లో ప్రత్యేక వసతులు కావాలంటూ ఏసీబీ కోర్టు (ACB Court)లో పిటిషన్ దాఖలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ లిక్కర్ స్కామ్ కేసు (AP liquor scam case)లో ఏ4 నిందితుడిగా అరెస్టై.. రాజమండ్రి సెంట్రల్ జైల్లో (Rajahmundry central jail) రిమాండ్ లో ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి (MP Mithun Reddy).. తనకు జైల్లో ప్రత్యేక వసతులు కావాలంటూ ఏసీబీ కోర్టు (ACB Court)లో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారి తమ అభ్యంతరాలు తెలిపేందుకు విచారణకు హాజరయ్యారు. సుప్రీంకోర్టు (Supreme Court) నిబంధనల ప్రకారం అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్న ఆయన.. ఇంటి నుంచి భోజనం అనుమతించాలంటే అండర్ టేకింగ్ లెటర్ అవసరమని తెలిపారు. ఇరువర్గాల వాదనలు ముగియగా.. కోర్టు తుది నిర్ణయం వెలువరించాల్సి ఉంది.
కాగా.. మిథున్ రెడ్డి కోరిన సౌకర్యాల్లో టిఫిన్ సహా మూడు పూటలా ఇంటి భోజనం, కిన్లే వాటర్ బాటిల్స్, కొత్త పరుపు, మంచం, స్పెషల్ పిల్లోస్, వెస్ట్రన్ కమోడ్ ఉన్న రూమ్, టీవీ, అతనికి సేవలు చేసేందుకు ఒక వ్యక్తి, న్యూస్ పేపర్లు, దోమ తెర, వాకింగ్ షూ వంటి వసతులు కావాలని పేర్కొన్నారు. అలాగే ప్రొటీన్ పౌడర్, ఒక టేబుల్, వైట్ పేపర్స్, పెన్ను, యోగా మ్యాట్ కూడా కావాలని అడిగారు. అసలు ఒక పొలిటిషియన్ జైల్లో ఉంటే ఇన్ని వసతులు ఎందుకు కల్పించాలి ? సరే ఆయనకు ఆరోగ్యం బాలేక ఇంటి భోజనం వగైరా వంటివి అడిగారనుకుందాం. మరి కామన్ మ్యాన్ కు కూడా ఈ సౌకర్యాలు ఇవ్వడానికి కోర్టు ఒప్పుకుంటుందా ? వీటిపై చట్టాలు ఏం చెప్తున్నాయి?
భారతదేశంలో జైళ్లను నిర్వహించే నియమాలు రాష్ట్రాల జైలు మాన్యువల్‌ల ద్వారా నిర్దేశించబడతాయి. ఉదాహరణకు ఢిల్లీ జైలు మాన్యువల్, మహారాష్ట్ర జైలు మాన్యువల్. ఈ నియమాలు ఖైదీలందరికీ ఒకే విధమైన ట్రీట్‌మెంట్ ఉండాలని సూచిస్తాయి. అయితే.. కొన్ని సందర్భాల్లో, జైలు అధికారులు విశేష పరిస్థితులు.. ఉదాహరణకు, ఆరోగ్య కారణాలు, భద్రతా కారణాలు పేరుతో VIPలకు అదనపు సౌకర్యాలు కల్పిస్తారు.
చట్టపరంగా జైలులో స్పెషల్ ఫెసిలిటీల కోసం నిర్దిష్ట నిబంధనలు లేవు, కానీ అవినీతి, పవర్ డైనమిక్స్, సిస్టమ్‌లోని లోపాల కారణంగా VIPలు తరచూ అనుకూల ట్రీట్‌మెంట్ పొందుతారు. సాధారణ వ్యక్తికి ఈ అవకాశం లేకపోవడం వల్ల సామాజిక, ఆర్థిక అసమానతలు స్పష్టంగా కనిపిస్తాయి. ఈ అసమానతలను తగ్గించడానికి జైలు సంస్కరణలు, బలమైన యాంటీ-కరప్షన్ చట్టాల అమలు, పబ్లిక్ అవేర్‌నెస్ అవసరమని కొందరు అభిప్రాయపడుతున్నారు.






