- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వద్దన్నా బిల్లులు ఎందుకు చెల్లించారు?
by Thanuru Gopichand |
వద్దని చెప్పినా రుషికొండ ప్యాలెస్ కాంట్రాక్టరుకు ఎందుకు బిల్లులు చెల్లించారని ఆర్థికశాఖ ఉన్నతాధికారులపై మంత్రి పయ్యవుల కేశవ్ మండిపడ్డారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: వద్దని చెప్పినా రుషికొండ ప్యాలెస్ కాంట్రాక్టరుకు ఎందుకు బిల్లులు చెల్లించారని ఆర్థికశాఖ ఉన్నతాధికారులపై మంత్రి పయ్యవుల కేశవ్ మండిపడ్డారు. చెల్లింపుల వ్యవహారంపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. అయితే రుషికొండ ప్యాలెస్ నిర్మాణ పనుల బిల్లులను చెల్లించలేదని అధికారులు చెప్పారు. అదే సంస్థ చేపట్టిన వేరే పనులకు బిల్లులు చెల్లించినట్లు వివరించారు. అయితే వేరే బిల్లులైనా సరే.. ఆ కాంట్రాక్టరుకు ఎందుకు చెల్లింపులు జరపాల్సి వచ్చిందని పయ్యావుల అసంతృప్తి వ్యక్తం చేశారు. చెల్లింపుల కోసం ఎవరైనా సిఫార్సు చేశారా..? లేక సొంత నిర్ణయమా..? అని అధికారులను ప్రశ్నించారు. ఇకపై ఆ కాంట్రాక్టరు చేపట్టిన ఎలాంటి పనులకైనా సీఎం లేదా తన దృష్టికి తీసుకురాకుండా బిల్లుల చెల్లింపులు జరపొద్దని స్పష్టంచేశారు.
Next Story






