AP News:అదానీని జగన్ మూడు సార్లు ఎందుకు కలిశారు?:టీడీపీ సీనియర్ నేత

by Jakkula.Mamatha |   (  Updated:2024-11-24 09:49:06  IST  )

రాష్ట్రంలో టీడీపీ(TDP), వైసీపీ నేతల(YCP Leader) మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది.

AP News:అదానీని జగన్ మూడు సార్లు ఎందుకు కలిశారు?:టీడీపీ సీనియర్ నేత
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో టీడీపీ(TDP), వైసీపీ నేతల(YCP Leader) మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఈ క్రమంలో తాజాగా టీడీపీ సీనియర్ నేత(TDP senior leader) ఆనం వెంకట రమణారెడ్డి(Anam Venkata Ramana Reddy) మాజీ సీఎం జగన్(YS Jagan) పై సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం జగన్ అంతర్జాతీయ స్థాయిలో అవినీతికి పాల్పడ్డారని టీడీపీ నేత ఆనం వెంకట రమణారెడ్డి ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆయన నేడు(ఆదివారం) నెల్లూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. విద్యుత్ ఒప్పందాలలో మాజీ సీఎం వైఎస్ జగన్ భారీగా అవినీతి చేశారన్నారు. ఒప్పందాలపై మీడియాకు ఒక్క విషయం చెప్పలేదని.. ఇప్పుడు కథలు అల్లుతున్నారని దుయ్యబట్టారు. ఆ ఒప్పందాల్లో జగన్ రూ.1750 కోట్లు దోచుకున్నారని మండిపడ్డారు. ఆయన 3 సార్లు అదానీని ఎందుకు కలిశారని ప్రశ్నించారు. 16 సీబీఐ కేసులున్న జగన్ ఇప్పటి వరకు కోర్టుకెళ్లలేదని వీటిపై న్యాయస్థానాలు త్వరగా విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

Next Story