- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సభా హక్కుల కమిటీ ముందు రావడానికి ఎందుకు భయం?
తప్పు చేయకపోతే సభా హక్కుల కమిటీ (Privilage Committee) ముందుకు రావడానికి జగన్ మీడియా ఎందుకు భయపడుతోందని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు (Yanamala Ramakrishnudu) ప్రశ్నించారు.

దిశ, వెబ్ డెస్క్ : తప్పు చేయకపోతే సభా హక్కుల కమిటీ (Privilage Committee) ముందుకు రావడానికి జగన్ మీడియా ఎందుకు భయపడుతోందని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు (Yanamala Ramakrishnudu) ప్రశ్నించారు. తప్పుడు వార్తలు రాసి.. ఇప్పుడు ప్రోసీడింగ్స్ ను అడ్డుకుంటారా అని నిలదీశారు. శాసనసభ ప్రివిలేజ్ కమిటీ ముందుకొచ్చి సాక్షిలో తప్పుడు వార్తలపై వివరణ ఇవ్వొచ్చు కదా అన్నారు. సభా హక్కుల కమిటీకి జగన్ మీడియా ఎందుకు భయపడుతోందో ప్రజలకు తెలియజేయాలన్నారు.
వివరాల్లోకి వెళ్తే
శాసనసభ పట్ల ప్రజల్లో తప్పుడు అభిప్రాయాన్ని కలిగించే కథనాన్ని ప్రచురించినట్లు సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డి, చీఫ్ రిపోర్టర్ ఫణికుమార్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కోట్లు ఖర్చు-శిక్షణ తుస్సు అనే శీర్షికతో ప్రచురించిన కథనంపై శాసనసభ ప్రివిలేజ్ కమిటీ వేసింది. దానిపై విచారణకు హాజరు కావాల్సిందిగా వారిని ఆదేశించింది. దీంతో ప్రివిలేజ్ కమిటీ విచారణ ప్రక్రియను నిలిపివేయాలని వారు హైకోర్టును ఆశ్రయించారు. వారి అభ్యర్థనను తోసిపుచ్చుతూ హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. షోకాజ్ నోటీసు దశలో ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. అదనపు మెటీరియల్ సమర్పించేందుకు వీలుగా సమయం ఇచ్చేందుకు అభ్యంతరం లేదన్న సెక్రెటరీ జనరల్, ప్రివిలేజ్ కమిటీ తరఫు న్యాయవాది వాదనను నమోదు చేసింది. అదనపు మెటీరియల్‌ను ప్రివిలేజ్ కమిటీ ముందు ఉంచేందుకు జగన్ పత్రిక ఎడిటర్, చీఫ్ రిపోర్టర్‌కు రెండు వారాలు సమయం ఇచ్చింది. వార్తా కథనానికి సంబంధించి సాక్ష్యం ఇచ్చేందుకు ఈనెల 21న ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరు కావాలని ఎడిటర్, చీఫ్ రిపోర్టర్‌లకు సెక్రెటరీ జనరల్ లేఖ పంపిన నేపథ్యంలో వారి ఇద్దరి హాజరును ధర్మాసనం వాయిదా వేసింది.






