- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యూరియా కొరతకు బాధ్యత ఎవరిది.. ప్రభుత్వానికి మాజీ మంత్రి కాకాణి సూటి ప్రశ్న
రాష్ట్రంలో యూరియా కొరతకు బాధ్యత కేంద్రానిదా లేక రాష్ట్ర ప్రభుత్వానిదా అని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి (Kakani Goverdhan Reddy) సీఎం చంద్రబాబు (CM Chandrababu)ను ప్రశ్నించారు.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో యూరియా కొరతకు బాధ్యత కేంద్రానిదా లేక రాష్ట్ర ప్రభుత్వానిదా అని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి (Kakani Goverdhan Reddy) సీఎం చంద్రబాబు (CM Chandrababu)ను ప్రశ్నించారు. ఇవాళ ఆయన తాడేపల్లి (Thadepally)లోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా మీడియాతో మాట్లాడతూ.. ఎన్డీయే (NDA) కూటమిలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు సకాలంలో యూరియా సరఫరా చేయకుండా అన్నదాతలకు తీరని అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. బ్లాక్ మార్కెట్లలో యూరియాను అధిక ధరలకు అమ్ముకుంటున్నారని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాలు వైసీపీ ప్రభుత్వం నుంచి కాపీ కొట్టినవేనని అన్నారు.
అసలు చంద్రబాబుకు కొత్త పథకాల ఆలోచన ఎన్నడూ రాదని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో ఎరువులు అందక అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వంలో అవినీతి కూడా బాగానే పెరిగిపోయిందని అన్నారు. నాడు రైతులకు ఎరువులు అందని పరిస్థితి వస్తే.. తమ ప్రభుత్వం ఆర్బీకేల ద్వారా అన్ని సమకూర్చామని తెలిపారు. బాబు సర్కార్ వ్యవసాయాన్ని నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. అసలు వారిని పట్టించుకునే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదని అన్నారు. ఇక రాష్ట్రంలోని మంత్రులు అవినీతి సొమ్మును కూడబెట్టే పనిలో నిమగ్నమయ్యారని ఫైర్ అయ్యారు. యూరియా అందక రైతులు అవస్థలు పడుతోన్న తరుణంలో నైతికత ఉంటే మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు (Achennaidu) వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని కాకాణి గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు.






