- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుమల మద్యం బాటిళ్ల కేసు: మూడో వ్యక్తి ఎక్కడ.. అసలు సూత్రదారులెవరు..?
తిరుమల మద్యం బాటిళ్ల కేసు వెనుక అసలు సూత్రదారులెవరు..?

దిశ, వెబ్ డెస్క్: తిరుమల(Tirumala)లో మద్యం బాటిళ్ల(Liquor bottles) కేసును ఛేదించిన విషయం తెలిసిందే. అయితే పరారైన మరో వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మొత్తం ముగ్గురు వ్యక్తులు తిరుమల కౌస్తుభం గెస్ట్ హౌస్(Tirumala Kaustubham Guest House) వద్ద మద్యం బాటిళ్లు పడేశారు. ప్రభుత్వానికి, తిరుమల పవిత్రతకు చెడ్డ పేరు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ ఘటనకు పాల్పడ్డారు. వీరి వెనుక ఓ పార్టీకి చెందిన వారున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు విచారణను కొనసాగిస్తున్నారు. పరారైన మూడో వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తే మరిన్ని విషయాలు బయటకొస్తాయని భావిస్తున్నారు. ఈ మేరకు నిందితుడిని త్వరగా పట్టుకునేందుకు అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్నారు. ‘‘పరారీలో ఉన్న వ్యక్తి ఎక్కడున్నారు. ఎందుకు పారిపోయారు. ఎవరి వద్దకు వెళ్లారు. ఈ వ్యవహారం వెనుక అసలు సూత్రదారి ఎవరు?.’’ అనే వివరాలు రాబడుతున్నారు.
ఇప్పటికే పలు ఆధారాలు..
తిరుమల పవిత్రతను దెబ్బతీసేందుకు దుండగులు ప్రయత్నం చేసిన ఘటనపై ఇప్పటికే పోలీసులు పలు ఆధారాలు సేకరించారు. తిరుమల కౌస్తుభం గెస్ట్ హౌస్ వద్ద మద్యం బాటిళ్ల లభ్యం కావడంతో స్థానిక సీసీ కెమెరాలు, ఫాస్టాగ్ రిపోర్టు, నిందితుల వాహన రాకపోకలు, ఫోన్ సిగ్నల్స్ సహా ఇతర టెక్నాలజీ ద్వారా పోలీసులు విచారణ చేపట్టారు. మద్యం సీసాలపై ఉన్న లేబుళ్ల ఆధారంగా కొనుగోలు చేసిన వైన్ షాపు నుంచి వ్యక్తుల సమాచారాన్ని రాబట్టారు. ఈ కుట్రలో ముగ్గురు వ్యక్తులున్నారని గుర్తించి ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని సైతం పలు కోణాల్లో విచారించారు. కోర్టు ప్రవేళపెట్టారు. అయితే ఇద్దరు నిందితులను బెయిల్ వచ్చింది. మూడో వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తే త్వరలోనే అన్ని విషయాలను బయటకు వస్తాయని పోలీసులు తెలిపారు.






