విచారణకు ఎక్కడికి రమ్మంటే అక్కడికొస్తా.. నోటీసులపై ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి

by Kema Shiva Kumar |

ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యే బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి (Buchepally Siva Prasad Reddy)కి పొదిలి (Podili) పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

విచారణకు ఎక్కడికి రమ్మంటే అక్కడికొస్తా.. నోటీసులపై ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యే బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి (Buchepally Siva Prasad Reddy)కి పొదిలి (Podili) పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 11న పొదిలిలో మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) చేపట్టిన రైతు పోరుబాటలో శాంతిభద్రతలకు భంగం కలిగించినట్లుగా ఆ నోటీసులలో పోలీసులు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఆ నోటీసులపై తాజాగా ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా అయన మీడియాతో మాట్లాడుతూ.. తాను హైదరాబాద్‌లోనే ఉన్నానని, ఎక్కడికీ పారిపోలేదని అన్నారు. విచారణకు ఎక్కడకు రమ్మంటే అక్కడకు వచ్చేందుకు తాను సిద్ధమని ప్రకటించారు. ఓ రాష్ట్రానికి సీఎంగా పని చేసిన వ్యక్తి నియోజకవర్గంలో పర్యటిస్తుంటే పోలీసులు శాంతిభద్రతలు కాపాడలేకపోయానని కామెంట్ చేశారు. పర్యటనకు ముందే పోలీసుల నుంచి పర్మీషన్ తీసుకున్నా.. తనకు అకారణంగా నోటీసులు జారీ చేశారని ఫైర్ అయ్యారు. శాంతిభద్రతలను కాపాడాల్సింది పోలీసులని.. తాను కాదని ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌ అన్నారు.

Next Story