High Court: మావోయిస్టులు దేవ్‌జీ, రాజిరెడ్డి ఎక్కడ..? ఆధారాల్లేక కేసు కొట్టేసిన హైకోర్టు

by Ramesh Naini |

మావోయిస్టు అగ్రనేతలు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ, మల్లా రాజిరెడ్డిలు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారనే అంశం సంచలనంగా మారింది.

High Court: మావోయిస్టులు దేవ్‌జీ, రాజిరెడ్డి ఎక్కడ..? ఆధారాల్లేక కేసు కొట్టేసిన హైకోర్టు
X

దిశ, డైనమిక్ బ్యూరో: మావోయిస్టు అగ్రనేతలు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ, మల్లా రాజిరెడ్డిలు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారనే అంశం సంచలనంగా మారింది. ఇటీవల ఏపీ పోలీసులు విజయవాడలో మావోయిస్టు అగ్రనేతలను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పోలీసుల అదుపులో మావోయిస్టులు దేవ్ జీ, మల్లా రాజిరెడ్డిలు ఉన్నారని ప్రచారం జరిగింది. కానీ పోలీసులు మాత్రం ఈ విషయం ధృవీకరించలేదు. కానీ వారు పోలీసుల నిర్బంధంలోనే ఉన్నారని, కోర్టులో హాజరుపర్చడం లేదని పౌరహక్కుల సంఘం నేతలు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ పిటిషన్‌పై ఇవాళ (శుక్రవారం) విచారించిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. పోలీసుల వద్ద దేవ్‌జీ, రాజిరెడ్డి ఉన్నారనేందుకు ప్రాథమిక ఆధారాలు లేవని, అందువల్ల తమ వద్దకు వచ్చిన వ్యాజ్యంపై జోక్యం చేసుకోలేమని ధర్మాసనం తెలిపింది. పోలీసుల అదుపులో ఉన్నట్లు ఆధారాలు లేకపోవడంతో హైకోర్టు కేసు కొట్టేసింది. నిర్బంధించినట్టు ఆధారాలు ఉంటే భవిష్యత్‌లో కోర్టును ఆశ్రయించేందుకు పిటిషనర్లకు న్యాయస్థానం వెసులుబాటు కల్పించింది.

Next Story