రైతులకు బిగ్ అలర్ట్.. తొలి విడత డబ్బుల జమ ఎప్పుడంటే?

by Jakkula.Mamatha |   (  Updated:2025-06-24 05:51:06  IST  )

ఏపీ(Andhra Pradesh)లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం రాష్ట్రాభివృద్దే లక్ష్యంగా దూసుకెళ్తుంది.

రైతులకు బిగ్ అలర్ట్.. తొలి విడత డబ్బుల జమ ఎప్పుడంటే?
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ(Andhra Pradesh)లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం రాష్ట్రాభివృద్దే లక్ష్యంగా దూసుకెళ్తుంది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు(CM Chandrababu) ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు. ఈ తరుణంలో ఇటీవల కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్(Super Six) హామీల్లో భాగంగా తల్లికి వందనం పథకం అమలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరో హామీని అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో అన్నదాత సుఖీభవ పథకం అమలుకు రంగం సిద్ధమైంది. రైతులకు ఏటా రూ.20వేలు అందించే అన్నదాత సుఖీభవ పథకాన్ని ఈ నెల చివరిలో ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ డబ్బులు ఈ నెలాఖరులో జమ కానుండగా, అదే రోజు అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం(AP Government) భావిస్తోంది. అయితే, అన్నదాత సుఖీభవ పథకం పీఎం కిసాన్ యోజన కింద ఒక విడతల్లో రూ.7000, మరో విడతలో రూ.7000, ఇంకో విడతలో రూ.6000 చొప్పున అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా అన్నదాత సుఖీభవ తొలి విడత సాయం రూ.7000 ఈ నెల(జూన్) 20వ తేదీన విడుదల చేయాలని తొలుత భావించారు. కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ నెల(జూన్) చివరి వరకు ఈ పథకం అమలు ఆలస్యమవుతోందని తెలిపారు. తదుపరి రెండో విడత డబ్బులు అక్టోబర్‌లో రూ.7వేలు, వచ్చే ఏడాది జనవరిలో రూ.6వేలు ఖాతాల్లో వేయనుందని సమాచారం.

Next Story