మెగా డీఎస్సీ తుది ‘కీ’ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?

by Jakkula.Mamatha |

కూటమి ప్రభుత్వం(AP Government) అధికారంలోకి వచ్చాక 16,347 పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే.

మెగా డీఎస్సీ  తుది ‘కీ’ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
X

దిశ,వెబ్‌డెస్క్: కూటమి ప్రభుత్వం(AP Government) అధికారంలోకి వచ్చాక 16,347 పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జూన్ 6 నుంచి జూలై 2 వరకు 23 రోజుల పాటు పరీక్షలు నిర్వహించారు. మొత్తంగా 3,36,307 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. మెగా డీఎస్సీ(Mega DSC) పరీక్షలకు 92.90 శాతం మంది హాజరయ్యారు. ఈ క్రమంలో ఫలితాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు కీలక అప్డేట్ వచ్చింది. తాజాగా మెగా డీఎస్సీ తుది కీ ఫలితాలను విడుదల చేశారు. ఈ మేరకు డీఎస్సీ కన్వీనర్ ఎం.వి.కృష్ణారెడ్డి వెల్లడించారు.

ఫలితాలు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచారు. అసలు విషయంలోకి వెళితే.. ఏపీ(Andhra Pradesh)లోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ నిర్వహించింది. ఈ పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక కీ ని విడుదల చేసిన తర్వాత అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ లో అభ్యంతారాలు స్వీకరించారు. వీటిని పరిశీలించిన నిపుణుల బృందం తుది కీ ని రూపొందించింది. తుది కీ పై ఎలాంటి అభ్యంతరాలు స్వీకరించరు. ‘కీ’ కోసం అబ్యర్థులు అధికారిక https://apdsc.apcfss.in/ వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఇక, త్వరలోనే డీఎస్సీ ఫలితాలను వెల్లడించే అవకాశముంది.

Next Story