Narendra modi: సభలో ప్రధాని మోదీ ఏం ప్రకటిస్తారో..? సర్వత్రా అదే ఆసక్తి

by Thanuru Gopichand |   (  Updated:2025-05-02 06:35:14  IST  )

ఈ రోజు అమరావతిలో జరగున్న భారీ భహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏం ప్రకటిస్తారు..?

Narendra modi: సభలో ప్రధాని మోదీ ఏం ప్రకటిస్తారో..? సర్వత్రా అదే ఆసక్తి
X

దిశ, డైనమిక్ ​బ్యూరో: ఈ రోజు అమరావతిలో (Amaravati) జరగున్న భారీ భహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏం ప్రకటిస్తారు..? తెలుగు రాష్ట్రాల్లో సర్వత్రా ఇదే ఆసక్తి నెలకొంది. ఆయన ఏఏ వరాలు ప్రకటిస్తారో అని అంతా ఆశగా ఎదురు చూస్తున్నారు. కేంద్ర రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ సానుకూలత మోదీపై ఆశలను మరింత పెంచేస్తున్నాయి. ఏపీ ప్రజల కళ్లన్నీ ఇప్పుడు రాజధాని (Rajadhani) అమరావతిపైనే ఉన్నాయి. భారీ ఎత్తున మొదలవనున్న రాజధాని పనులకు ప్రధాని మోదీ వస్తుండడంతో అందరి చూపు దాని పైనే ఉంది. ఎందుకంటే గతంలో జరిగిన శంకుస్ధాపన కార్యక్రమంలో కేవలం మట్టి నీళ్లే ఇచ్చి చేతులు దులుపుకున్నారనే విమర్శలు వెంటాడుతూనే ఉన్నాయి.

ఈ సారి కేంద్రంలో రాష్ట్రంలో కూటమి భాగస్వామ్యం ఉండడంతో ప్రధాని భారీ ప్రకటనే చేస్తారని అనుకుంటున్నారు. ప్రధాని మోదీ ప్రసంగంపై ఏపీ వ్యాప్తంగా ఒకింత ఉత్కంఠ కూడా నెలకొంది. గత ఐదేళ్ల కాలంలో అమరావతి పనులు మూలన పడిపోయాయి. ఆ ఐదేళ్లలోనూ కేంద్రంలో ప్రధానిగా నరేంద్ర మోదీనే ఉన్నారు. అయినా అమరావతి అంగుళం కూడా కదలలేదు. అయితే ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. అమరావతిపై కేంద్రం సానుకూల ప్రకటనలు కూడా చేస్తోంది. కేంద్ర బడ్జెట్​నుంచి అమరావతికి నిధులు ఇస్తానని చెబుతోంది. ప్రంపంచ బ్యాంకు, ఏడీబీ బ్యాంకులు కూడా రుణాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వ సహకారం లేకపోతే ఇవన్నీ సాధ్యం కావు. దీంతో అమరావతిని చెప్పటినట్లుగా మూడేళ్లలో పూర్తి చేసేందుకు ప్రధాని మోదీ కూడా పూర్తిగా సహకరిస్తారని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కీలక ప్రకటన చేస్తారని అంతా ఎదురుచూస్తున్నారు.

Next Story