- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శ్రీశైల మల్లన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు.. దర్శనానికి సమయం ఎంతంటే?
వేసవి కావడంతో భక్తులు(Devotees) దైవ దర్శనానికి బయలుదేరుతున్నారు.

దిశ,వెబ్‌డెస్క్: వేసవి కావడంతో భక్తులు(Devotees) దైవ దర్శనానికి బయలుదేరుతున్నారు. ఈ తరుణంలో పలు ఆలయాలను దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రముఖ పుణ్యక్షేత్రం రెండో జ్యోతిర్లింగం శ్రీశైలం(Srisailam)లోని ముక్కంటి మల్లన్న ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. వేసవి సెలవుల నేపథ్యంలో భక్తులు శ్రీశైలానికి బారులు తీరారు. అలాగే సోమవారం శివుడికి ప్రీతికరమైన రోజు కావడంతో శ్రీశైలానికి నేడు భక్తులు పోటెత్తారు. ఆలయ క్షేత్రమంత భక్త జనంతో సందడి వాతావరణం నెలకొంది. ఉదయం నుంచే భక్తులు పాతాళగంగలో పుణ్య స్నానాలు ఆచరించి శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనార్థమై క్యూలైన్లు, దర్శనం కంపార్టుమెంట్లలో బారులు తీరారు. దీంతో ఆలయ అధికారులు ఆర్జిత అభిషేకాలు, కుంకుమార్చనలు తాత్కాలికంగా రద్దు చేసి స్పర్శ దర్శనాలు మాత్రమే అనుమతిస్తున్నారు. ఇక స్వామివారి దర్శనానికి క్యూలైన్లలో 3 గంటలు పడుతుంది.






