- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Tirumala News:తిరుమల క్యూ లైన్‌లో అపశ్రుతి.. అసలు ఏం జరిగిందంటే?
కలియుగ దైవం తిరుమల(Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తారు.

దిశ,వెబ్‌డెస్క్: కలియుగ దైవం తిరుమల(Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తారు. శ్రీవారిని దర్శించుకుంటే సకల పాపాలు హరించి పోతాయని భక్తులు విశ్వసిస్తారు. ఈ తరుణంలో ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు తిరుమల చేరుకుని.. కాలినడకన శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. ఇక ప్రస్తుతం వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమలలో భక్తుల(Devotees) రద్దీ రోజురోజుకు పెరుగుతుంది. ఈ క్రమంలో అన్ని కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి చూస్తున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా తిరుమలలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. తిరుమల శ్రీవారి ఆలయం ముందు క్యూలైన్‌లో అపశ్రుతి చోటుచేసుకుంది. భక్తులు గొడవకు దిగి కొట్టుకున్నారు. నిన్న(శనివారం) సాయంత్రం క్యూలైన్ లో చిన్న పిల్లలతో వస్తున్న మహిళలను తోటి భక్తులు తోసివేశారు. దీంతో పిల్లలతో వస్తున్న మహిళను ఎలా తోసివేస్తావంటూ తోటి భక్తులతో ఆమె బంధువులు గొడవకు దిగారు. ఈ క్రమంలో క్యూలైన్ లోనే పొట్టు పొట్టు కొట్టుకున్నారు. అక్కడే ఉన్న విజిలెన్స్, పోలీస్ సిబ్బంది వారిని అదుపు చేసేందుకు ఎంత ప్రయత్నించినా భక్తులు వినకుండా కొట్టుకున్నారు. ఈ క్రమంలో వెంటనే ఘటనా స్థలానికి విజిలెన్స్ అధికారులు చేరుకొని భక్తులను పక్కకు తీసుకెళ్లి సర్ది చెప్పడం తో గొడవ ముగిసింది.






