- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Tirumala News:శ్రీవేంకటేశ్వర స్వామి వారి దర్శనానికి సమయం ఎంతంటే?
by Jakkula.Mamatha |
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల(Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు(Devotees) దర్శించుకుంటారు.

X
దిశ,వెబ్‌డెస్క్: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల(Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు(Devotees) దర్శించుకుంటారు. గత కొన్ని రోజుల నుంచి తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో నేడు(మంగళవారం) శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. భక్తులు కంపార్ట్‌మెంట్లు దాటి అతిథి గృహం వెలుపల వరకు వేచి ఉన్నారు. క్యూలైన్‌లోని భక్తులకు శ్రీవారి సేవకుల ద్వారా అన్నప్రసాదం, పాలు, తాగునీరు అందిస్తున్నారు. నిన్న(సోమవారం) శ్రీవారిని 77,481మంది భక్తులు దర్శించుకున్నారు. 30,612 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం(Hundi Income) రూ.3.96 కోట్లు వచ్చిందని టీటీడీ(TTD) అధికారులు తెలిపారు.
Next Story






