- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుమల శ్రీవారి దర్శనానికి సమయం ఎంతంటే?
by Jakkula.Mamatha |
తిరుమల(Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు(Devotees) దర్శించుకుంటారు.

X
దిశ, వెబ్‌డెస్క్: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల(Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు(Devotees) దర్శించుకుంటారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈ క్రమంలో నేడు(సోమవారం) శ్రీవారి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. ఈ తరుణంలో శ్రీవారి సర్వదర్శనం కోసం భక్తులు ఉదయం 6గంటల నుంచే 25 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. తిరుమలకు వచ్చిన భక్తులు.. ఎటువంటి ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని టీటీడీ అధికారులు తెలిపారు. క్యూలైన్‌లోని భక్తులకు శ్రీవారి సేవకుల ద్వారా అన్నప్రసాదం, పాలు, తాగునీరు అందిస్తున్నారు. నిన్న(ఆదివారం) శ్రీవారిని 85,179 మంది భక్తులు దర్శించుకున్నారు. 18,831 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం(Hundi Income) రూ.4.79 కోట్లు వచ్చిందని టీటీడీ(TTD) అధికారులు తెలిపారు.
Next Story






