- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Tirumala News:తిరుమల శ్రీవారి దర్శనానికి సమయం ఎంతంటే?
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు.

దిశ,వెబ్‌డెస్క్: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. తిరుమల శ్రీవారిని దర్శించుకుంటే సకల పాపాలు హరించి పోతాయని భక్తులు విశ్వసిస్తారు. ఈ క్రమంలో ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు తిరుమలకు చేరుకుని.. భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లించుకుంటారు. ఈ తరుణంలో తిరుమల కొండపై భక్తుల రద్దీ కొన్ని సార్లు సాధారణంగా లేదా అధికంగా ఉంటుంది. గత వారం నుంచి తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ రోజు(శుక్రవారం) ఏపీలోని తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఈ క్రమంలో తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం పడుతుంది. భక్తులు కంపార్ట్‌మెంట్లు దాటి శిలాతోరణం వరకు వేచి ఉన్నారు. నిన్న(గురువారం) శ్రీవారిని 63,897 మంది భక్తులు దర్శించుకున్నారు. 29,500 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.66 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.






