తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. దర్శనానికి సమయం ఎంతంటే?

by Jakkula.Mamatha |

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల(Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు(Devotees) దర్శించుకుంటారు.

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. దర్శనానికి సమయం ఎంతంటే?
X

దిశ,వెబ్‌డెస్క్: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల(Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు(Devotees) దర్శించుకుంటారు. ఈ క్రమంలో తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈ రోజు(గురువారం) శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. 12 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. క్యూలైన్‌లోని భక్తులకు శ్రీవారి సేవకుల ద్వారా అన్నప్రసాదం, పాలు, తాగునీరు అందిస్తున్నారు. నిన్న(బుధవారం) శ్రీవారిని 75,303 మంది భక్తులు దర్శించుకున్నారు. 27,166 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న(బుధవారం) శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.99 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. గత నెల(జూన్)లో సాధారణం కంటే అధికంగా శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ నెలలో సాధారణ రోజుల్లో సైతం భక్తుల రద్దీ ఉంటోంది.

Next Story