తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. దర్శనానికి సమయం ఎంతంటే?

by Jakkula.Mamatha |

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల(Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు(Devotees) దర్శించుకుంటారు.

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. దర్శనానికి సమయం ఎంతంటే?
X

దిశ,వెబ్‌డెస్క్: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల(Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు(Devotees) దర్శించుకుంటారు. తిరుమల శ్రీవారిని దర్శించుకుంటే సకల పాపాలు హరించి పోతాయని భక్తులు విశ్వసిస్తారు. ఈ క్రమంలో ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు తిరుమలకు చేరుకుని.. భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లించుకుంటారు. ఈ తరుణంలో తిరుమల కొండపై భక్తుల రద్దీ కొన్ని సార్లు సాధారణంగా లేదా అధికంగా ఉంటుంది. ఈ క్రమంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు.

ఈ నేపథ్యంలో ఇవాళ(గురువారం) తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. భక్తులు కంపార్ట్‌మెంట్లు దాటి శిలాతోరణం వరకు వేచి ఉన్నారు. నిన్న(బుధవారం) శ్రీవారిని 75,104 మంది భక్తులు దర్శించుకున్నారు. 31,896 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం(Hundi Income) రూ.3.66 కోట్లు వచ్చిందని టీటీడీ(TTD) అధికారులు తెలిపారు.

Next Story