తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి సమయం ఎంతంటే?

by Jakkula.Mamatha |   (  Updated:2025-07-10 02:42:00  IST  )

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు.

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి సమయం ఎంతంటే?
X

దిశ,వెబ్‌డెస్క్: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. తిరుమల శ్రీవారిని దర్శించుకుంటే సకల పాపాలు హరించి పోతాయని భక్తులు విశ్వసిస్తారు. ఈ క్రమంలో ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు తిరుమలకు చేరుకుని భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లించుకుంటారు. ఈ క్రమంలో తిరుమల కొండ పై కొన్నిసార్లు భక్తుల రద్దీ సాధారణంగా లేదా అధికంగా ఉంటుంది. ఇదిలా ఉంటే.. గత 15 రోజులుగా భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది.

రద్దీ దృష్ట్యా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా టీటీడీ అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఈ తరుణంలో ఇవాళ(గురువారం) తిరుమలలో మళ్లీ భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. శ్రీవారి భక్తులు 29 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. నిన్న(బుధవారం) శ్రీవారిని 76,501 మంది భక్తులు దర్శించుకున్నారు. 29,033 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.39కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు.

Next Story