Tirumala News:20 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులు.. దర్శనానికి సమయం ఎంతంటే?

by Jakkula.Mamatha |

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల(Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు(Devotees) దర్శించుకుంటారు.

Tirumala News:20 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులు.. దర్శనానికి సమయం ఎంతంటే?
X

దిశ,వెబ్‌డెస్క్: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల(Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు(Devotees) దర్శించుకుంటారు. ఈ క్రమంలో గత వారం రోజుల నుంచి తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈ క్రమంలో ఇవాళ(ఆదివారం) తిరుమల శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. 20 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. క్యూలైన్‌లోని భక్తులకు శ్రీవారి సేవకుల ద్వారా అన్నప్రసాదం, పాలు, తాగునీరు అందిస్తున్నారు. నిన్న(శనివారం) శ్రీవారిని 82,367 మంది భక్తులు దర్శించుకున్నారు. 31,420 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.28 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. గత నెల(జూలై)లో సాధారణ రోజుల్లో సైతం భక్తుల రద్దీ నెలకొంది.

Next Story