తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. దర్శనానికి సమయం ఎంతంటే?

by Jakkula.Mamatha |

కలియుగ వైకుంఠ దైవం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. దర్శనానికి సమయం ఎంతంటే?
X

దిశ,వెబ్‌డెస్క్: కలియుగ వైకుంఠ దైవం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. తిరుమల(Tirumala) శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు(Devotees) దర్శించుకుంటారు. ఈ క్రమంలో తిరుమలలో భక్తుల రద్దీ కొన్ని సార్లు సాధారణంగా లేదా అధికంగా ఉంటుంది. ఈ క్రమంలో ఇవాళ(శనివారం) తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. సర్వ దర్శనం కోసం 6 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న(శుక్రవారం) స్వామి వారిని 70,353 భక్తులు దర్శించుకున్నారు. 25,636 తలనీలాలు సమర్పించారు. స్వామి వారి రూ.3.65 కోట్ల హుండీ ఆదాయం(Hundi Income) సమకూరిందని టీటీడీ(TTD) అధికారులు తెలిపారు.

Next Story