- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి సమయం ఎంతంటే?
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల(Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు(Devotees) దర్శించుకుంటారు.

దిశ,వెబ్‌డెస్క్: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల(Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు(Devotees) దర్శించుకుంటారు. ఈ తరుణంలో తిరుమలలో భక్తుల రద్దీ గత వారం రోజులుగా కొనసాగుతుంది. ఈ క్రమంలో నేడు(సోమవారం) తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. భక్తులు 12 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు.
క్యూలైన్‌లోని భక్తులకు శ్రీవారి సేవకుల ద్వారా అన్నప్రసాదం, పాలు, తాగునీరు అందిస్తున్నారు. నిన్న(ఆదివారం) శ్రీవారిని 85,486 మంది భక్తులు దర్శించుకున్నారు. 30,929 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం(Hundi Income) రూ.3.85 కోట్లు వచ్చిందని టీటీడీ(TTD) అధికారులు తెలిపారు. గత నెల(జూన్)లో సాధారణం కంటే అధికంగా శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ నెల(జూలై)లో సాధారణ రోజుల్లో సైతం భక్తుల రద్దీ ఉంటుంది.






