- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నారా లోకేష్‌ను మెచ్చుకున్న పీఎం మోడీ.. కారణం ఏంటంటే?
విశాఖ వేదికగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది.

దిశ,వెబ్‌డెస్క్: విశాఖ వేదికగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. ఈ కార్యక్రమంలో పీఎం నరేంద్ర మోడీ, గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తోపాటు కేంద్ర, రాష్ట్ర మంత్రులు పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ కార్యక్రమానికి లక్షలాది మంది ప్రజలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు, పాఠశాల విద్యార్థులు, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు, క్రీడాకారులు, యోగా సంఘాలు, నౌకాదళం, కోస్ట్ గార్డు సభ్యులు, పారిశ్రామికవేత్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. వీరంతా విశాఖ ఆర్కే బీచ్ నుంచి భోగాపురం వరకు దాదాపు మూడు లక్షల మంది ప్రజలు సామూహిక యోగా ప్రదర్శనలు చేశారు.
ఈ నేపథ్యంలో విశాఖ(Vishakapatnam)లో అంతర్జాతీయ యోగా దినోత్సవం(International Yoga Day) విజయవంతం కావడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(PM Narendra Modi) హర్షం వ్యక్తం చేశారు. ఈ తరుణంలో నెల రోజులుగా ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారని మంత్రి నారా లోకేష్‌ను(Minister Nara Lokesh) పీఎం మోడీ మెచ్చుకున్నారు. యోగాను సామాజికంగా ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో చేసి చూపించారని కొనియాడారు. అలాగే, సమాజంలోని అన్ని వర్గాలను ఒక తాటి మీదకు ఎలా తీసుకురావాలో యోగాంధ్ర కార్యక్రమంలో నిరూపించారని నారా లోకేష్‌ను పీఎం మోడీ ప్రశంసించారు.






