- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Department Of Education: స్కూళ్లకు కీలక ఆదేశాలు జారీ చేసిన విద్యాశాఖ.. కారణం ఏంటంటే?

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ(Andhra Pradesh)లో స్కూళ్ల(School)కు రాష్ట్ర విద్యాశాఖ(State Education Department) కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రేపు(సోమవారం)విద్యార్థులతో ప్రధాని నరేంద్ర మోడీ(PM Narendra Modi) చేపట్టే ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమాన్ని అందరూ చూసేలా అన్ని స్కూళ్లల్లో ఏర్పాట్లు చేయాలని పాఠశాల(School) విద్యాశాఖ ఆదేశించింది. ఇందుకోసం RJD, DEO, ప్రిన్సిపాళ్లు చర్యలు చేపట్టాలని సూచించింది. రేపు(ఫిబ్రవరి 10) ఉదయం 11 గంటలకు డీడీ న్యూస్(DD News), డీడీ ఇండియా(DD India) ద్వారా లైవ్ ఉంటుందని తెలిపింది.
విద్యార్థులు(Students), టీచర్లు(Teachers) ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ఫొటోలను SCERT AP, MYGov పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలంది. ఇదిలా ఉంటే.. పీఎం నరేంద్ర మోడీ, విద్యా మంత్రిత్వ శాఖ అత్యంత ప్రత్యేకమైన కార్యక్రమం ‘పరీక్ష పే చర్చ’ 2025 టీజర్‌ను న్యూఢిల్లీలోని సుందర్ నర్సరీలో ఏర్పాటు చేశారు. ఈ ఏడాది PPC శైలి చాలా మారిపోయింది. ఈ క్రమంలో ‘పరీక్షా పే చర్చ’ 8వ ఎడిషన్ 8 ఎపిసోడ్‌లలో ప్రసారం అవుతుంది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు చదువుకోవడానికి ప్రధాని మోడీ(PM Modi) సులభమైన చిట్కాలు అందిస్తారు. దీంతో పాటు పరీక్ష ఒత్తిడి(Stress)ని తగ్గించుకునే మార్గాలను కూడా విద్యార్థులకు చెబుతారు.