శ్రీశైలానికి కొనసాగుతున్న వరద.. ప్రస్తుత నీటి మట్టం ఎంతంటే?

by Jakkula.Mamatha |   (  Updated:2025-07-19 02:20:39  IST  )

ఎగువ పరీవాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది

శ్రీశైలానికి కొనసాగుతున్న వరద.. ప్రస్తుత నీటి మట్టం ఎంతంటే?
X

దిశ,వెబ్‌డెస్క్: ఎగువ పరీవాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల, సుంకేసుల జలాశయం నుంచి 1,41,513 క్యూసెక్కుల వరద వస్తోంది. శ్రీశైలం కుడి, ఎడమ గట్టు జలవిద్యుత్తు కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ 67,793 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తూన్నారు. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం నీటిమట్టం 881.20 అడుగులకు చేరింది. జలాశయం పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 194.7599 టీఎంసీలుగా నమోదైంది. అయితే.. ఎగువ ప్రాంతాల నుంచి ఇన్ ఫ్లోలు పెరుగుతున్నాయని, అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పడంతో డ్యామ్ నిండే అవకాశం ఉందని భావిస్తున్నారు. రానున్న మూడు రోజుల్లో వరద నీరు మరింత చేరితే గేట్లు ఎత్తే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు నీటిపారుదల శాఖ అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. ఇక జూరాల ప్రాజెక్టు నుంచి కూడా శ్రీశైలానికి వరద ప్రవాహం వస్తోంది.

Next Story