- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home Minister Anitha: తప్పు చేసినవాడికి కులమేంటి..?
తప్పు చేసిన వారికి కులం, మతం ఏంటని హోమంత్రి వంగలపూడి అనిత ప్రశ్నించారు.

తెనాలి ఘటనకు రాజకీయ రంగు పులుముతున్నారు..
వైసీపీ హయాంలో ఆరోజు జగన్ ఎందుకు మాట్లాడలేదు..
ఇప్పడు గంజాయి బ్యాచ్వారి ఇంటికి వెళుతున్నారు..
హోం మంత్రి వంగలపూడి అనిత కామెంట్స్
దిశ, డైనమిక్ బ్యూరో : తప్పు చేసిన వారికి కులం, మతం ఏంటని హోమంత్రి వంగలపూడి అనిత ప్రశ్నించారు. తెనాలిలో (Tenali) ముగ్గురు యువకులను పోలీసులు రోడ్డుపై కొట్టిన ఘటనకు సంబంధించి ఆమె తొలిసారిగా స్పం దించారు. వారిని పరామర్శించేందుకు రేపు మాజీ సీఎం జగన్ (YS Jagan) తెనాలి వెళుతున్న నేపథ్యంలో ఆమె విలేకరులతో పలు విషయాలు వెల్లడించారు. విజయవాడ సత్యనారాయణపురం మోడల్ పోలీస్ స్టేషన్ ఈ రోజు డీజీపీతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ తెనాలి ఘటనకు సంబంధించిన యువకులపై ఎన్ని కేసులు ఉన్నాయో డీజీపీ (DGP) వివరాలు మీడియాకు తెలియజేశారని గుర్తు చేశారు. ఒక గంజాయి బ్యాచ్ పోలీస్ డిపా ర్ట్మెంట్ మీద చేయి చేసుకున్నప్పుడు, జరిగిన ఘటనను రాజకీయరంగు పులిమి, కులం మతం అంటగట్టటం ఏంటన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో పోలీస్ డిపార్ట్మెంట్ ఏ విధంగా పనిచేస్తుందన్నారు. మాస్క్ అడిగిన పాపానికి గతంలో డాక్టర్ సుధాకర్ ను నడిరోడ్డుపై రెక్కలు విరిచి నడిరోడ్డుపై చొక్కా విప్పిన సందర్భాన్ని మర్చిపోయారా అని జగన్ను అన్నారు.
ఆరోజు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం పై దాడి చేసినప్పుడు..మా కార్యకర్తలకు బీపీ వచ్చిందని జగన్ సమర్థించుకున్నాడని తెలిపారు. రాజమండ్రిలో వరప్రసాద్ అనే వ్యక్తి ఇసుక మాఫియా గురించి మాట్లాడితే పోలీస్ స్టేషన్లో కూర్చోపెట్టి శిరోముండనం చేశారని గుర్తు చేశారు. ఆరోజు వరప్రసాద్, డాక్టర్ సుధాకర్ (Doctor Sudhakar) ఇళ్లకు వెళ్లి జగన్ఎందుకు పలకరించలేదు అన్నారు. పులివెందులలో ఓ మహిళను హత్య చేస్తే తాము అక్కడికి వెళ్తే మాపై కేసు పెట్టారని గుర్తు చేశారు. ఈరోజు రాజకీయ లబ్ధి కోసం కులాలను మతాలను రెచ్చగొట్టడం కోసం జగన్ గంజాయి బ్యాచ్ వారి ఇంటికి వెళ్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. పోలీసులను వారి పని సక్రమంగా చేసు కోనివ్వాలని సూచించారు. గత ప్రభుత్వంలో హోంశాఖ సీఎం, హోంమంత్రి చేతుల్లో లేదని సజ్జల కనుసన్నల్లో ఉందని ఆరోపించారు. వైసీపీ నాయకులు సిగ్గులేకుండా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీ వ్యాప్తంగా లక్ష సీసీ కెమెరాలు..
సత్యనారాయణ మోడల్పోలీస్స్టేషన్లో ఒక జిమ్, యోగా విభాగాలను ఏర్పాటు చేశారని అన్నారు. దీని ద్వారా పోలీసులకు ఒత్తిడి తగ్గుతుందన్నారు. మహిళలతోపాటు చిన్నారులు వస్తే వారు ఆడుకోవటానికి ఒక జోన్ ఏర్పాటు చేశారని. రౌడీ షీటర్లకు ఫేస్ రికగ్నైజేషన్ పెట్టారని తెలిపారు. ఇందుకోసం టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నారని అన్నారు. ఈ పోలీస్టేషన్ పరిధిలో రెండువందల కెమెరాలు పెట్టామని తెలిపారు. ఏపీ వ్యాప్తంగా లక్ష సీసీ కెమెరాలు (CC Camera) ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. తమ ప్రభుత్వంలో అక్రమ అరెస్టులు లేవు, హౌస్ అరెస్టులు లేవని స్పష్టం చేశారు. తాము పరదాలు కట్టుకుని దాక్కుని వెళ్లడంలేదని చెప్పారు. ప్రజలతో, ప్రజల మధ్య తిరుగుతున్నామని హోంమంత్రి అనిత పేర్కొన్నారు.






