- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుమల భక్తులకు అలర్ట్.. దర్శనానికి సమయం ఎంతంటే?
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల(Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు(Devotees) దర్శించుకుంటారు.

దిశ,వెబ్‌డెస్క్: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల(Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు(Devotees) దర్శించుకుంటారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈ క్రమంలో నేడు(శుక్రవారం) శ్రీవారి దర్శనానికి 12 నుంచి 15 గంటల సమయం పడుతోంది. ఈ తరుణంలో శ్రీవారి సర్వదర్శనం కోసం భక్తులు 31 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు.
తిరుమల భక్తులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని టీటీడీ అధికారులు తెలిపారు. క్యూలైన్‌లోని భక్తులకు శ్రీవారి సేవకుల ద్వారా అన్నప్రసాదం, పాలు, తాగునీరు అందిస్తున్నారు. నిన్న(గురువారం) శ్రీవారిని 51,082 మంది భక్తులు దర్శించుకున్నారు. 19,836 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం(Hundi Income) రూ.3.86 కోట్లు వచ్చిందని టీటీడీ(TTD) అధికారులు తెలిపారు.
ఇదిలా ఉండగా.. తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనాలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, శ్రీవాణి కోటా టికెట్లను ఈ రోజు ఆన్‌లైన్ ద్వారా విడుదల చేయనున్నారు. తొలి మూడు రోజులకు ఈ-డిప్ ద్వారా ఇప్పటికే కేటాయించారు. మిగిలిన ఏడు రోజులకు నేటి ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో రోజుకు వెయ్యి చొప్పున శ్రీవాణి దర్శన టికెట్లు విడుదల చేస్తారు.






