- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Breaking:వల్లభనేని వంశీకి మరో బిగ్ షాక్.. విషయమేంటంటే?
వైసీపీ నేత వల్లభనేని వంశీకి మరో షాక్ తగిలింది.

దిశ,వెబ్‌డెస్క్: వైసీపీ నేత వల్లభనేని వంశీకి మరో షాక్ తగిలింది. సత్య వర్ధన్ కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరైన విషయం విదితమే. గన్నవరం టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో ఆయన ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ క్రమంలో బెయిల్ పై రేపు(శుక్రవారం) తీర్పు వెలువడనుంది. ఈ తరుణంలో వల్లభనేని వంశీ అస్వస్థతకు గురికావడంతో కోర్టు ఆదేశాలతో పోలీసులు ఆయనను విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
చికిత్స అనంతరం.. వంశీ ప్రధానంగా శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్నట్లు గుర్తించిన వైద్యులు మెడిసిన్ అందజేశారు. ఇదిలా ఉంటే.. తాజాగా వల్లభనేని వంశీకి మరో షాకింగ్ న్యూస్ వచ్చింది. బావులపాడులో నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో పోలీసులు నూజివీడు కోర్టులో ఆయన పై పీటీ వారెంట్ దాఖలు చేశారు. దీనికి న్యాయమూర్తి అనుమతిస్తే వంశీ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉండదు. కాగా ఆయన పై నమోదైన కేసుల్లో ఇప్పటికే 5 కేసుల్లో బెయిల్ వచ్చింది.






