- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Aghori:మరోసారి ప్రత్యక్షమైన అఘోరీ.. రోడ్డు పక్కన కారు ఆపి ఏం చేస్తుందంటే?
తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల ఓ అఘోరీ(Aghori) హల్‌చల్ చేసిన విషయం తెలిసిందే.

దిశ,వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల ఓ అఘోరీ(Aghori) హల్‌చల్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh), తెలంగాణ(Telangana)లోని పలు ఆలయాలను సందర్శించిన అఘోరీ.. పలుచోట్ల దురుసుగా ప్రవర్తిస్తూ వార్తల్లో నిలిచారు. ఇలా కొన్ని రోజులు లేడీ అఘోరీ రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించారు. కొన్ని రోజుల క్రితం ఏపీలోని పలు ఆలయాలను సందర్శించిన అఘోరీ మాత.. పోలీసులు అడ్డుకుంటున్నారంటూ రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేయడం.. వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలుగుతుందని నచ్చజెప్పేందుకు వచ్చిన పోలీసులపై అఘోరీ దురుసుగా ప్రవర్తించడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ తరుణంలో అఘోరీ ప్రవర్తనపై స్థానికులు, ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అఘోరీలు అంటే ప్రజలకు దూరంగా జీవనం గడుపుతుంటారని.. నిత్యం దైవస్మరణతో జీవిస్తారని.. ఇలా ప్రజలను ఇబ్బంది పెట్టేలా వ్యవహరించారని ఫైరయ్యారు. ఇక తర్వాత కొద్ది రోజుల నుంచి ఎవరికి కనిపించకుండా ఉన్న అఘోరీ(Aghori) మాత మళ్లీ ప్రత్యక్షం అయ్యింది. అసలు విషయంలోకి వెళితే.. తాజాగా ఎన్టీఆర్ జిల్లా(NTR District) నందిగామ నియోజకవర్గంలోని కంచికచర్ల సమీపంలో అఘోరీ ప్రత్యక్షం అయ్యింది. తన కారును రోడ్డు పక్కనే ఆపి.. కారులోనే నిద్రించింది. ఇది తెలుసుకున్న ప్రజలు అఘోరీ మాత మళ్లీ వచ్చిందంటూ.. అఘోరీని చూసేందుకు ఎగబడ్డారు. ఈ క్రమంలో అఘోరీని ఫొటోస్, వీడియోలు తీశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.






