- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చనిపోతున్నానంటూ మహిళా సెల్ఫీ వీడియో.. చివరికి ఏమైందంటే!
తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవాడానికి నిత్యం వేలాది మంది వస్తుంటారు.

X
దిశ,వెబ్‌డెస్క్: తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవాడానికి నిత్యం వేలాది మంది వస్తుంటారు. ఈ క్రమంలో తాజాగా తిరుమల(Tirumala)లో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. అసలు విషయంలోకి వెళితే.. తమిళనాడు(Tamilnadu)కు చెందిన భావన(35) అనే మహిళ భర్తతో గొడవపడి తిరుమల వచ్చింది. శ్రీవారి మెట్టు మార్గం నుంచి వెళుతూ.. తాను ఆత్మహత్య చేసుకోబోతున్నట్లుగా బెంగళూరు(Bengaluru)లో ఉన్న అన్నకు సెల్ఫీ వీడియో పంపింది. ఆ వీడియో చూసిన అతను వెంటనే తిరుమల పోలీసులకు సమాచారం అందించారు. వీడియోలోని లొకేషన్, సీసీటీవీల ఆధారంగా గంటలోనే పోలీసులు ఆమెను గుర్తించారు. ఈ క్రమంలో పోలీసులు ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చారు. భర్త, పిల్లలను పిలిపించి మాట్లాడి సురక్షితంగా ఇంటికి పంపినట్లు సమాచారం.
Next Story






