- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
PHOTO:పవన్ కళ్యాణ్ చేతికి సెలైన్ డ్రిప్.. ఆందోళనలో ఫ్యాన్స్.. ఇంతకీ ఏమైంది?
ఏపీలో ఇటీవల సీఎం చంద్రబాబు(CM Chandrababu) అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ జరిగిన విషయం తెలిసిందే.

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఇటీవల సీఎం చంద్రబాబు(CM Chandrababu) అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మంత్రివర్గ సమావేశానికి హాజరైన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy CM Pawan Kalyan).. ఆరోగ్యం సహకరించక పోవడంతో తిరిగి క్యాంపు కార్యాలయనికి వెళ్లారు. దీంతో మంత్రివర్గ సమావేశంలో పవన్ కల్యాణ్ కుర్చీ మరోసారి ఖాళీగా దర్శనమిచ్చింది. ఇంతకు ముందు కూడా పవన్ కళ్యాణ్ ఆనారోగ్యం కారణంగా ఏపీ కేబినెట్ మీటింగ్‌కు(AP Cabinet Meeting) హాజరుకాలేదనే విషయం తెలిసిందే. అయితే నిన్న(బుధవారం) ఆయన చేతికి సెలైన్ డ్రిప్‌తో కనిపించారు.
రాష్ట్ర(Andhra Pradesh) సచివాలయంలో 16వ ఆర్థిక సంఘం సభ్యులతో మంత్రివర్గం కీలకమైన సమావేశంలో పాల్గొంది. ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్(Pawan Kalyan) పాల్గొన్నారు. ఈ క్రమంలో పవన్ చేతికి సెలైన్ డ్రిప్(Saline drip) తగిలించుకొని కనిపించారు. దీంతో ఆ ఫొటో సామాజిక మాధ్యమాల్లో(Social Media) వైరల్ కావడంతో పవన్ కళ్యాణ్‌కు ఏమైందని ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే.. గతంలో పవన్ కల్యాణ్ స్పాండిలైటిస్‌తో బాధపడిన విషయం తెలిసిందే. ఇటీవల ఆయన తరచు అనారోగ్యానికి గురవుతున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలో అనారోగ్యంతో ఉన్న పవన్ కళ్యాణ్ ప్రభుత్వ సమావేశానికి హాజరవ్వడం.. ఆయన కమిట్‌మెంట్‌కు నిదర్శనమని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.






