ముగిసిన భేటీ.. తిరుమల తొక్కిసలాట ఘటన పై అమిత్ షా ఏమన్నారంటే?

by Jakkula.Mamatha |   (  Updated:2025-01-19 09:56:55  IST  )

కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేడు(ఆదివారం) ఏపీలో పర్యటించారు.

ముగిసిన భేటీ.. తిరుమల తొక్కిసలాట ఘటన పై అమిత్ షా ఏమన్నారంటే?
X

దిశ,వెబ్‌డెస్క్: కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేడు(ఆదివారం) ఏపీలో పర్యటించారు. ఈ క్రమంలో ఉదయం బీజేపీ నేతలతో సమావేశమైన ఆయన పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. అనంతరం కొండపావులూరులో ఎన్డీఆర్‌ఎఫ్ ఆవిర్భావ వేడుకలకు హాజరయ్యారు. ఈ క్రమంలో ఎన్‌ఐడీఎమ్, ఎన్‌డీఆర్‌ఎమ్ ప్రాంగణాలను హోం మంత్రి అమిత్ షా ప్రారంభించారు. ఈ నేపథ్యంలో విజయవాడ నగరంలోని నోవాటెల్ హోటల్‌లో దాదాపు గంటన్నర పాటు జరిగిన సమావేశంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తిరుమల తొక్కిసలాట ఘటనపై మాట్లాడారు.

తిరుమల తొక్కిసలాట ఘటన పై కేంద్ర హోం శాఖ దృష్టి పెట్టిందని అమిత్ షా చెప్పారు. ఇదిలా ఉంటే.. తిరుపతి తొక్కిసలాట ఘటన నేపథ్యంలో క్షేత్రస్థాయి పరిశీలనకు కేంద్ర హోంశాఖ అధికారులు సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ అంశంపై ఏపీ సీఎం చంద్రబాబు అమిత్ షా ఎదుట సీరియస్ అయినట్లు తెలుస్తోంది. దీంతో అమిత్ షా ఆదేశాలతో కేంద్ర అధికారులు TTDకి రాసిన లేఖను వెనక్కు తీసుకున్నారు. అలాగే 'హైందవ శంఖారావం' సభ విజయం పట్ల పార్టీ, విశ్వహిందూ పరిషత్ నేతలకు అమిత్ షా అభినందనలు తెలిపారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి అందుతున్న సాయాన్ని, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని సూచించారు. అంతర్గత విభేదాలను పక్కన పెట్టి రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని హితవు పలికారు.

Next Story