- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TDP:రేషన్ షాపుల్లో సరుకులు పంపిణీ.. ప్రజలు ఏమంటున్నారంటే?
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన రేషన్ వాహనాలు కూటమి ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే.

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన రేషన్ వాహనాలు కూటమి ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పాత విధానంలోనే రేషన్ పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ తరుణంలో ప్రతి నెల ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకు రేషన్ సరుకులు రేషన్ షాపుల్లోనే పంపిణీ చేస్తారు. ఈ విధానం ఈ రోజు(ఆదివారం) నుంచే ప్రారంభం అయింది. ఈ నేపథ్యంలో ఏపీలో ఇవాళ(జూన్ 1) రేషన్ షాపుల ద్వారా రేషన్‌కార్డు లబ్ధిదారులకు సరుకులు పంపిణీ చేశారు.
ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం రేషన్ షాపుల్లో బియ్యం ఇవ్వడం పై ప్రజలు స్పందించారు. ఈ విధానం పై పలువురు మహిళలు స్పందించిన వీడియోను టీడీపీ షేర్ చేసింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రేషన్ బియ్యం డోర్ డెలివరీ చేయలేదని విమర్శించారు. వీధి చివరో, ఎక్కడో వ్యాన్ పెట్టే వాళ్ళని చెప్పారు. వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు వచ్చే వాళ్ళని దీంతో కొందరు ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. రోడ్ల పై బండిని ఉంచేవారని.. ఆ బండి వద్దకే వెళ్లి రేషన్ బియ్యం తెచ్చుకునే వాళ్లమని పేర్కొన్నారు.
సరుకులు రేషన్ షాపులో ఇవ్వడమే సరైనదనీ వారు తేల్చి చెప్పారు. దీంతో మాజీ సీఎం జగన్ ఫేక్ మాటలకు ఏపీ మహిళలే సమాధానం చెబుతున్నారని టీడీపీ విమర్శించింది. ఇదిలా ఉంటే.. ‘‘ప్రజలకు ఇంటికే అందుతున్న సేవలపై కూటమి ప్రభుత్వానికి ఎందుకింత కక్ష’’ అని మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. మళ్లీ పేదలకు రేషన్ కష్టాలు ఎందుకు తెస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఈ క్రమంలో వైసీపీకి కౌంటర్‌గా టీడీపీ ఆ వీడియో షేర్ చేసింది.






