- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రియుడితో ఏకాంతంగా భార్య.. వారిద్దరిని అలా చూసిన భర్త ఏం చేశాడంటే?
వివాహేతర సంబంధాలు జీవితాలు నాశనం చేస్తున్నాయి.

దిశ,వెబ్‌డెస్క్: వివాహేతర సంబంధాలు జీవితాలు నాశనం చేస్తున్నాయి. దీంతో కుటుంబాలు రోడ్డున పడుతున్న ఘటనలు కూడా చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో దారుణమైన ఘటన వెలుగు చూసింది. ఏలూరు జిల్లా నిడమర్రు మండలంలో ఓ వివాహితకు సమీప గ్రామానికి చెందిన యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. అయితే ఆమె భర్తకు వీరి ప్రేమ వ్యవహారం గురించి తెలిసి వారిద్దరికి చాలా సార్లు వార్నింగ్ ఇచ్చాడు. కానీ ఆమె ఏం పట్టనట్టు వ్యవహరించేది. ప్రియుడిని కలుస్తూనే ఉంది. దీంతో ఆమె భర్త ఏం చేయాలో అర్థం కాక ఆలోచనలో పడిపోయాడు.
ఈ క్రమంలో ఉండి మండలంలోని ఓ గ్రామంలో శనివారం రాత్రి తన భార్యతో ఆమె ప్రియుడు ఉండడాన్ని గమనించిన భర్త తీవ్ర ఆవేశానికి గురయ్యాడు. ఈ క్రమంలో అక్కడికి వెళ్లి యువకుడిని బంధించి తన తండ్రికి సమాచారం ఇచ్చాడు. ఈ తరుణంలో తన భార్యతో తరచుగా మెసేజ్‌లు పంపుతున్న ఆ యువకుడి చెయ్యిని సగానికి నరికారు. ఆ తర్వాత యువకుడిపై దాడి చేసి, చివరికి కాపవరం పంట కాలువ రేవులో పడేసి ముగ్గురు వెళ్లిపోయారు. తీవ్ర రక్తస్రావం కావడంతో అతను చనిపోయాడు. పోలీసులకు అతని కుడి చెయ్యి సోమవారం లభ్యమైందని తెలిపారు. మృతుడు నిడమర్రు బావాయిపాలేనికి చెందిన మజ్జి ఏసురాజు(26)గా పోలీసులు గుర్తించారు. వివాహిత భర్త, ఆమె మామలే ఆమె ప్రియుడు ఏసు రాజును హత్య చేశారని పోలీసులు గుర్తించారు. ఈ ఇద్దరికి మరో వ్యక్తి సహకరించాడని అనుమానిస్తున్నారు. బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు వివాహిత భర్త, ఆమె మామను అరెస్టు చేసి విచారణ చేపట్టారు. అయితే వారిని విచారించగా విషయం ఒప్పుకున్నారు.






