సత్యనారాయణ స్వామి గుడి వద్దకు వచ్చిన ఏనుగు.. ఏం చేసిందంటే?

by Jakkula.Mamatha |

సత్యనారాయణ స్వామి గుడి వద్ద ఒంటిరి ఏనుగు హల్‌చల్ చేసింది.

సత్యనారాయణ స్వామి గుడి వద్దకు వచ్చిన ఏనుగు.. ఏం చేసిందంటే?
X

దిశ,వెబ్‌డెస్క్: చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలో ఏనుగుల గుంపు హల్‌చల్ చేస్తూ స్థానికులను భయాందోళనకు గురిచేస్తున్న ఘటనలు ఇటీవల వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఓ ఒంటరి ఏనుగు పలమనేరు లోని సత్యనారాయణ స్వామి గుడి వద్దకు వచ్చి హల్ చల్ చేసింది. ఇవాళ(శనివారం) తెల్లవారుజామున గుడి వద్ద ఏనుగును గమనించిన వాకర్స్ భయాందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో ఆ ఒంటరి ఏనుగు జనవాసాల మధ్యలోకి రావడంతో ఒక్కసారిగా స్థానికులు పరుగులు తీశారు. స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న అటవీ శాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ తరుణంలో ఏనుగును అటవీ ప్రాంతం వైపు మళ్లించే ప్రయత్నం చేయగా, ఏనుగు తిరగబడింది. అటవీశాఖ సిబ్బంది ఎఫ్ఆర్‌వో సుకుమార్ పై దాడి చేసింది.

Next Story