CM Chandrababu:టెస్టులకు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్‌.. సీఎం చంద్రబాబు ఏమన్నారంటే?

by Jakkula.Mamatha |   (  Updated:2025-05-12 11:50:51  IST  )

టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.

CM Chandrababu:టెస్టులకు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్‌.. సీఎం  చంద్రబాబు ఏమన్నారంటే?
X

దిశ,వెబ్‌డెస్క్: టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. టెస్టులకు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్‌ ప్రకటించడం పై ఏపీ(Andhra Pradesh) సీఎం చంద్రబాబు స్పందించారు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ(Virat Kohli) దేశానికే గర్వకారణం అని పేర్కొన్నారు. విరాట్ దేశానికి ఎంతో పేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చారని ప్రశంసించారు.

టెస్ట్ క్రికెట్ నుంచి విరాట్ కోహ్లీ రిటైర్మెంట్‌తో భారత క్రీడలలో ఒక అధ్భుతమైన అధ్యాయం ముగిసిందని సీఎం చంద్రబాబు(CM Chandrababu) తెలిపారు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఎన్నో రికార్డులు నెలకొల్పిన కోహ్లీ, ముఖ్యంగా టెస్ట్ ఫార్మాట్‌లో కెప్టెన్‌గా, బ్యాట్స్‌మన్‌గా భారత జట్టుకు చిరస్మరణీయ విజయాలు అందించాడని గుర్తుచేశారు. క్రికెట్‌లో అతని అభిరుచి, క్రమశిక్షణ, నాయకత్వం లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చాయి. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ ప్రయాణంలో తదుపరి దశకు సీఎం చంద్రబాబు ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.

Next Story