ఇండియా–పాక్ కాల్పుల విరమణ.. సీఎం చంద్రబాబు ఏమన్నారంటే?

by Jakkula.Mamatha |   (  Updated:2025-05-10 14:11:09  IST  )

భారత్–పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతల అనంతరం కాల్పుల విరమణ ఒప్పందానికి ఇరు దేశాలు అంగీకరించాయి.

ఇండియా–పాక్ కాల్పుల విరమణ.. సీఎం చంద్రబాబు ఏమన్నారంటే?
X

దిశ,వెబ్‌డెస్క్: భారత్–పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతల అనంతరం కాల్పుల విరమణ ఒప్పందానికి ఇరు దేశాలు అంగీకరించాయి. ఈ మేరకు భారత్ విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ప్రకటించారు. అనంతరం ఈ నెల(మే) 12న సాయంత్రం 5 గంటలకు మరోసారి ఇరు దేశాల డీజీఎంఓల మధ్య చర్చలు జరగనున్నట్లు తెలిపారు. ఈ ఒప్పందంలో అగ్రదేశం అమెరికా కీలక పాత్ర పోషించింది.

ఈ క్రమంలో కాల్పుల విరమణ పై ఏపీ(Andhra Pradesh) సీఎం చంద్రబాబు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాక్‌(Pakisthan) అభ్యర్థన మేరకే కాల్పుల విరమణకు భారత్ అంగీకరించిందని తెలిపారు. ఈనెల 12న మళ్లీ చర్చలు జరుగుతాయని పేర్కొన్నారు. ఉగ్రవాదంపై పోరాడుతున్న కేంద్రానికి అండగా ఉండాలని సీఎం చంద్రబాబు(CM Chandrababu) సూచించారు. యుద్ధంలో మరణించిన సైనికుల కుటుంబాలకు తోడుగా ఉంటామని వెల్లడించారు.

Next Story