- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Megastar Chiranjeevi:జయకేతనం సభలో పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ స్పీచ్.. చిరంజీవి ఏమన్నారంటే?
ఏపీ(Andhra Pradesh)లో జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ కాకినాడ జిల్లా(Kakinada District) పిఠాపురం(Pithapuram) మండలంలోని చిత్రాడలో నిన్న(శుక్రవారం) ఘనంగా నిర్వహించారు.

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ(Andhra Pradesh)లో జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ కాకినాడ జిల్లా(Kakinada District) పిఠాపురం(Pithapuram) మండలంలోని చిత్రాడలో నిన్న(శుక్రవారం) ఘనంగా నిర్వహించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ, విదేశాల నుంచి జనసైనికులు తరలిరావడంతో పిఠాపురం జనసంద్రాన్ని తలపించింది. జనసేన గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం అందుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మొదటి సారి అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న మొదటి సభ కావడంతో పెద్ద ఎత్తున కార్యకర్తలు, ఎమ్మెల్యేలు సభ వద్దకు చేరుకున్నారు.
‘జయకేతనం’ సభలో జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(AP Deputy CM Pawan Kalyan) ఉద్వేగభరితంగా ప్రసంగించారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతుంటే జనసైనికులు, అభిమానులు నినాదాలతో హోరెత్తించారు. శుక్రవారం జరిగిన జయకేతనం సభలోని జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రసంగ వీడియోలు సామాజిక మాధ్యమా(Social Media)ల్లో వైరల్ అవుతున్నాయి. అయితే మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ఎలక్ట్రానిక్ మీడియా(Electronic media) ద్వారా తమ్ముడు పవన్ కళ్యాణ్ ప్రసంగాన్ని వీక్షించారు. తమ్ముడి ప్రసంగానికి చిరంజీవి ఫిదా అయ్యారు. ఈ తరుణంలో సోషల్ మీడియా వేదికగా పవన్ ప్రసంగంపై ఆయన స్పందించారు.
జనసేన(Janasena) జయకేతన సభలో పవన్ స్పీచ్‌కి మంత్రముగ్దుడినయ్యానని పేర్కొన్నారు. సభకు వచ్చిన అశేష జన సంద్రంలానే తన మనసు ఉప్పొంగిందని చిరంజీవి పేర్కొన్నారు. ఈ క్రమంలో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే నాయకుడు వచ్చాడని నమ్మకం మరింత బలపడిందన్నారు. ప్రజా సంక్షేమం కోసం ఉద్యమస్ఫూర్తితో పవన్ కళ్యాణ్ జైత్రయాత్ర నిర్విఘ్నంగా కొనసాగాలని చిరంజీవి ఆశీర్వదించారు. ఈ క్రమంలో జన సైనికులందరికి హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.






